AP: సూర్యఘర్ పథకంతో ప్రజలు అదనపు ఆదాయం పొందొచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. దీని ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి ఇళ్లు నెలనెలా 60 యూనిట్లు వాడుకోవచ్చు.. 140 యూనిట్లు గ్రిడ్‌కు అమ్మకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఏటా రూ.4 వేల విలువైన విద్యుత్ ఉచితంగా రావడంతో పాటు గ్రిడ్‌కు అమ్మగా రూ.5 వేల అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు.