గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠన్ అధ్వర్యంలో డిసెంబర్ 22న యాదగిరిగుట్టలో జరగనున్న జాతీయ స్థాయి గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు పోస్టర్ ను బుధవారం బంజారాహిల్స్ లోని మంత్రుల నివాసంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మేల్యే భీర్ల ఐలయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి, సదస్సు కన్వీనర్ పడమటి పావని రెడ్డి, యానాల ప్రభాకర్ రెడ్డి, గాంధారి ప్రభాకర్ పాల్గొన్నారు.