నీటి బకెట్‌లో తలకిందులుగా పడి చిన్నారి మృతిచెందిన ఘటన ఖైరతాబాద్ లో జరిగింది. సతీశ్‌కుమార్, సుజాత కు ముగ్గురు సంతానం. చిన్న కుమార్తెకు ఏడాదిన్నర వయసు. బుధవారం ఆడుకుంటూ చిన్నారి బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. కొద్ది నిమిషాల్లో తల్లి చిన్నారిని వెతకగా నీరున్న బకెట్‌లో తలకిందులుగా పడి ఉండటం గమనించి వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు ధ్రువీకరించారు.