కేబిఆర్ పార్క్ వద్ద సైక్లింగ్ ను ప్రారంభించిన జోనల్ కమిషనర్
సైక్లింగ్ చేయడం వల్ల శరీరం దృఢంగా ఉంటుందని, ఆరోగ్యంగా ఉంటామని జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం కేబీఆర్ పార్క్ పార్క్ వద్ద నిర్వహించిన సైక్లింగ్ ను జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో సైక్లింగ్ ను చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగరవాసులు పాల్గొన్నారు.