హైదరాబాద్లో గిరిజన విద్యార్థిని అనుమానస్పదంగా మృతిచెందింది. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసారం బాగ్లో ఓ కన్సల్టెన్సీ ఆఫీస్లో పనిచేస్తున్న ఇస్లావత్ శ్రావ్య (20) అనే లా విద్యార్థిని ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావ్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ.. పీఎస్ ఎదుట గిరిజన సంఘాల నాయకులు, మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.