సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

54చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను నిలబెట్టిందని మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ అబ్దుల్లా బలాల అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మొత్తం 40 మందికి చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అర్హులైన పేద ప్రజలు కార్పొరేట్ వైద్య సేవల కోసం ముఖ్యమంత్రి సహాయనిది కి దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్