పుష్ప 2 సినిమా పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. సినిమాలో కొన్ని సీన్లు పోలీసులను కించపరిచేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ. ఇటీవలే థియేటర్కు వెళ్లి పుష్ప-2 సినిమా చూశానని, సినిమాలో కొన్ని సన్నివేశాలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. పోలీసుల పట్ల చిన్నచూపు చూసే విధంగా ఉందన్నారు.