యువకుడి దాడిలో వృద్ధుడి మృతి..

61చూసినవారు
యువకుడి దాడిలో వృద్ధుడు చనిపోయాడు. ఈ సంఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం గత నెల 30న బైక్పై వేగంగా వెళుతున్న యువకుడిని నెమ్మదిగా వెళ్లమని పాదచారుడు చెప్పడంతో యువకుడు దాడికి దిగాడు. వృద్ధుడు అని చూడకుండా రోడ్డు మీద తోసేశాడు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ బాధితుడు గురువారం చనిపోయాడు. యువకుడిని పోలీసులు రిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :