ముషీరాబాద్: అమరవీరుల త్యాగాలను స్మరించడం అంటే వారి ఆశయాలను కొనసాగించడమే అని వారి ఆశయ సాధనకు ప్రభుత్వాలు కృషి చేయాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం గన్ పార్క్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అలాగే అమరవీరుల కుటుంబాలకు ఇల్లు నిర్మించి నెలవారీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.