నేడు కుత్బుల్లాపూర్ లో కేసీఆర్ పోరు భాట..

61చూసినవారు
నేడు కుత్బుల్లాపూర్ లో కేసీఆర్ పోరు భాట..
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి బి.ఆర్.ఎస్. పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి కి మద్దతుగా తెలంగాణా తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర బుధవారం సాయంత్రం 6 గంటలకు కుత్బుల్లాపూర్ లోని దుండిగల్ కమాన్, ఔటర్ రింగురోడ్డు వద్ద జరగనున్నది.

ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ మునిసిపల్, డివిజన్, వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, మహిళా నాయకురాళ్ళు, యువజన విభాగం నాయకులు, సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.