సాగర్ నీరు విడుదల చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం

114చూసినవారు
సాగర్ నీరు విడుదల చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం
నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టులో సాగు సరిపడా నీరు ఉన్నందున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని కాలవ నీటి పై ఆధారపడి భూములు పంటలు వేయడానికి ఉపయోగపడుతుందని హుజూర్‌నగర్ నియోజకవర్గ అఖిలపక్ష నాయకులు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు తన్నీరు మల్లిఖార్జున్, వెంకటేశ్వర్లు, వెంకట్‌రెడ్డి, హరిబాబు, చంద్రారెడ్డి, సీతయ్య, అమర్‌నాధ్‌రెడ్డి, సూర్యనారయణ, రాములు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :