రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. పొలిశెట్టిగూడ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు కిషన్‌గూడ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన కారు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.