హైదరాబాద్ నగరం బేగంపేట, హకీంపేట పరిసర ప్రాంతాలలో శుక్రవారం ఇండియాన్ ఎయిర్ ఫోర్స్ సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ రిహార్సల్ నిర్వహించింది. ఎయిర్ షో కోసం ప్రక్రియ జరుగుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు ఒకేసారి ఆకాశంలో దూసుకెళ్తున్న దృశ్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. పలువురు టెర్రస్ మీదకు ఎక్కి వీక్షించి సంబరపడ్డారు.