
సనత్ నగర్: విద్యుత్ ఉండని ప్రాంతాలు
ఐడీపీఎల్ సబ్‌స్టేషన్ పరిధిలోని విద్యుత్ ఫీడర్ మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా ఉండదని గ్రీన్‌ల్యాండ్స్ సీబీడీ ఇన్‌ఛార్జి ఏడీఈ కిషోర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హెచ్పీరోడ్డు, లక్ష్మీకళ థియేటర్ ఏరియా, శ్రీరాములు థియేటర్ ఏరియా, అశ్వని హెయిర్ ఆయిల్ లేన్ ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని పేర్కొన్నారు.