తెలంగాణలో కులగణనపై బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహిస్తున్న సదస్సుకి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. పార్టీ కీలక నేతలతో పాటు 400 మందిని మాత్రమే సెంటర్లోకి పోలీసులు అనుమతించారు. సెంటర్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతలు, నిరుద్యోగులు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న సమాచారంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.