హైదరాబాద్ లో 2024లోనే దాదాపు 1400 లకు పైగా వాహనాలు చోరీ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. గతేడాది మొత్తం 1, 400 చోరీల కేసులు నమోదైతే ఈ ఏడాది ఇప్పటికే 1,400 దాటడం గమనార్హం. ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, ఇంటి ముందు పార్కు చేసినవి, కొన్నేళ్లుగా మూలకు పడి ఉన్న వాహనాలను ఎత్తుకెళ్తున్నారు. అయితే బైకులకు అలారమ్, సెన్సార్లు ఏర్పాటు చేసుకోవడం మేలని అధికారులు సూచిస్తున్నారు.