లాలాపేట్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని సికింద్రాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. సర్కిల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు నిర్మాణాలు చేపట్టకూడదని హెచ్చరించారు. అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.