పెట్రోల్ బంకు లో బీర్ బాటిల్తో హల్చల్ చేసిన యువకుడి అరెస్ట్

62చూసినవారు
పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకొని డబ్బులు ఇవ్వకుండా, అడిగితే బీరు బాటిల్తో పెట్రోల్ బంక్ సిబ్బందిపై హల్ చల్ చేసిన యువకుడ్ని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏసిపి జగన్ ఆధ్వర్యంలో సీ ఐ రాజేంద్ర నాయక్ శనివారం మీడియా సమావేశంలో తెలిపిన వివరాలు ప్రకారం జూన్ 8న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకొని డబ్బులు ఇవ్వకుండా హాల్చల్ చేశారని తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేశామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్