ఐఐసీటీ డైరెక్టర్ ని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో వారి కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. ప్రధానంగా హబ్సిగూడ నుండి నాచారం వెళ్లే దారిలో ఇరువైపులా ఐఐసీటీ ఇన్స్టిట్యూట్, ఐఐసీటీ క్వార్టర్స్ ప్రహరీ గోడల వల్ల ప్రధాన రోడ్డు ఇక్కడికి రాగానే బాటల్ నెక్ గా మారి ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డైరెక్టర్ దృష్టికి తీసుకుని రావడం జరగింది.