మోమోస్ తిని మహిళ మృతి.. మరో 20 మందికి అస్వస్థత

77చూసినవారు
సోమవారం బంజారాహిల్స్ లో మోమోస్ కలకలం రేగింది. నందిని నగర్ లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందింది. మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధిత కుటుంబాలకు చెందిన బంధువులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాడైపోయిన మోమోస్ కు కలర్ వేసి అమ్మిన షాప్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. చనిపోయిన మహిళ, అస్వస్థతకు గురైన బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్