తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘ఓ విషయంపై స్పష్టతనివ్వాలని అనుకుంటున్నా. ఉద్యోగాల కల్పన, వ్యాపారానికి, ఆవిష్కరణలకు, పోటీతత్వానికి మద్దతు ఇస్తా. గుత్తాధిపత్యానికి, మార్కెట్ నియంత్రణ శక్తులకు వ్యతిరేకం. మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా నా కెరీర్ను ప్రారంభించా’ అని అన్నారు.