పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందంటే అందుకు కారణం కురుమూర్తి స్వామి దయ అని సీఎం రేవంత్ చెప్పారు. మహబూబ్నగర్ (D) అమ్మాపూర్లో కురుమూర్తి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. కేసీఆర్ హయాంలో పాలమూరుకు పరిశ్రమలు, ప్రాజెక్టులు రాలేదని విమర్శించారు. ఇక్కడి బిడ్డనై ఉండి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు క్షమించరని అన్నారు.