నా కొడుకును మీకు అప్పగిస్తున్నాను: సోనియా గాంధీ

77చూసినవారు
రాహుల్ గాంధీకి అండగా నిలవాలని రాయబరేలీ ఎంపీ నియోజకవర్గం ప్రజలను కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ కోరారు. 'మా కుటుంబం మూలాలు ఈ నేలతో ముడిపడి ఉన్నాయి. మీ ప్రేమతో నాకు ఎప్పుడూ నేను ఒంటరిని అనే భావన కలగలేదు. నా కుమారుడిని మీకు అప్పగిస్తున్నాను. నన్ను ఆదరించినట్టే రాహులూ ఆశీర్వదించండి. మిమ్మల్ని నిరాశపరచడు' అని తెలిపారు. కాగా రాహుల్ ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

ట్యాగ్స్ :