ఏకపక్షంగా విగ్రహాలు తరలించారు: ఖర్గే

82చూసినవారు
ఏకపక్షంగా విగ్రహాలు తరలించారు: ఖర్గే
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోని ప్రముఖుల విగ్రహాల తరలింపును కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తప్పుబట్టారు. 'గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలను ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా తొలగించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉల్లంఘించడమే. ఎన్నో చర్చలు, పరిశీలన తర్వాత అక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాలను ఇప్పుడు ఒక మూలకు మార్చారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు మన పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలకు విరుద్ధం' అని ఆయన ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :