తమిళనాడులోని నీలగిరి కొండ రైలును ప్రారంభించి నేటికి సరిగ్గా 125 వసంతాలు. ఈ రైలు సేవలు 1899 జూన్ 15వ తేదీ మేట్టుపాళయం నుంచి కున్నూర్‌కు ప్రారంభమయ్యాయి. ఈ రైలును బ్రిటీష్ పర్యవేక్షణ ఇంజనీర్ జెఎల్‌ఎల్ మోరంట్ రూపొందించారు. ఆయనను స్మరించుకొనేలా శనివారం 125వ వార్షికోత్సవాలను నిర్వహించారు. అలాగే, కున్నూర్‌లో RCM చర్చి, వెల్లింగ్టన్ దేవాలయం, కూడలూరు చర్చి, లారెన్స్ పాఠశాల, ఊటీ బొటానికల్ పార్క్ కూడా ఆయనే నిర్మించారు.