నేటి కాలంలో అమ్మాయిలు ఎక్కువగా జీన్స్ వేసుకుంటున్నారు. అయితే జీన్స్ వేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. టైట్ గా ఉండే జీన్స్ వల్ల రక్త ప్రసరణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సంతానలేమి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. జీన్స్ వల్ల నరాలపై ఒత్తిడి పడి రక్త ప్రసరణ కూడా సరిగా జరగదు. దీంతో మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. టైట్ గా ఉండే జీన్స్ కన్నా వదులుగా ఉండే వాటిని ధరించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.