కారు షోరూమ్‌లో ఎలక్ట్రిక్ కారు దగ్ధం

68చూసినవారు
విజయవాడ గూడవల్లి మోరిస్ గ్యారేజ్ కారు షోరూమ్ లో ఎలక్ట్రిక్ కారు దగ్ధమైంది. కారు తగలబడతున్న దృశ్యాలను విలేకరులు చిత్రీకరిస్తుండగా షోరూమ్ సిబ్బంది అడ్డుకున్నారు. దాడి చేసి మ‌రీ ఫోన్లు లాగేసుకున్నారని విలేక‌ర్లు ఆరోపిస్తున్నారు. కనీస అగ్ని భద్రతా ప్రమాణాలు లేకుండా షోరూమ్ నిర్వహణకు అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారంటూ స్థానికులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్