ఇంట్లో తులసి మొక్క మంచి స్థితిలో ఉంటే అంతా మంచే జరుగుతుందని, అదే ఎండిపోయిన స్థితిలో ఉంటే చెడు సంకేతమని పండితులు చెబుతున్నారు. పితృదోషం ఉంటే తులసి ఎండిపోవచ్చని, అలాంటప్పుడు కుటుంబానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో వాస్తు దోషం, నర దృష్టి వల్ల కూడా తులసి మొక్క ఎండిపోతుందని పేర్కొంటున్నారు. స్నానం చేయకుండా తులసిని తాకొద్దని సూచిస్తున్నారు.