నీటిని వృథా చేస్తే రూ. 2,000 ఫైన్

61చూసినవారు
నీటిని వృథా చేస్తే రూ. 2,000 ఫైన్
దేశ రాజధాని నగరంలో ఎండల తీవ్రత, తాగునీటి కొరత వంటి పరిస్థితుల్ని అధిగమించేందుకు దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటి వృథాపై కొరడాకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా విధించనున్నట్లు మంత్రి అతిశీ తెలిపారు. నీటి పైపులతో కార్లను కడగడం, వాటర్‌ ట్యాంకర్లు ఓవర్‌ ఫ్లో కావడం, వాడుక నీటిని నిర్మాణ, వాణిజ్యపరమైన అవసరాల కోసం వినియోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారుల్ని ఆదేశించారు.