గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే రూ.కోటి రివార్డు ఇస్తామంటూ క్షత్రియ కర్ణిసేన ప్రకటించింది. ఈ మేరకు క్షత్రియ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ ఓ వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే.. ఏ పోలీసు అధికారికైనా రూ.1,11,11,111 రివార్డు అందజేస్తాం. అమర్ షహీద్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని హత్య చేసిన నిందితుల్లో లారెన్స్ బిష్ణోయ్ కూడా ఒకరు’’ అని అన్నారు.