ఇంట్లో ఈ మార్పులు చేస్తే ఆర్థిక సమస్యలు రావు!

4220చూసినవారు
ఇంట్లో ఈ మార్పులు చేస్తే ఆర్థిక సమస్యలు రావు!
ఇంట్లో వాస్తు దోషం కారణంగా కూడా ఆర్ధిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు రావొద్దంటే ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇంట్లో ఉత్తరం దిక్కున కొన్ని వస్తువులను పెడితే మంచి ఫలితాలు ఉంటాయట. ఏ దిక్కున ఏ వస్తువులను పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మించుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

వాస్తు నిపుణుల సూచనల ప్రకారం ఇంట్లో అద్దం ఉత్తరం వైపున ఉంటే మంచిది. లేదంటే కుటుంబంలో సమస్యలు వస్తాయి.

ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే చాలా మంచిదట. మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఉత్తరం వైపు ఉంచాలని చెబుతున్నారు.

అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఉత్తరం వైపున ఉండాలి. ఇలా ఉంటే ఆహార కొరత ఉండదు.

సంబంధిత పోస్ట్