TG: కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయానికి వెళ్లిన కుల గణన సర్వే అధికారులకు ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ గతంలో మాట్లాడిన వీడియోను అధికారులకు చూపిస్తూ ఇప్పుడు ఏం మోహంతో సర్వే చేపడుతున్నారని ప్రశ్నించారు.