దసరా రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు

57చూసినవారు
దసరా రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు
దసరా నాడు దేవతా వృక్షమైన జమ్మి చెట్టును పూజించటం ఒక సంప్రదాయంగా వస్తోంది. జమ్మి చెట్టు అనేది విజయానికి సూచిక. అందుకే జమ్మి ఆకులను అందరికీ పంచుతారు. దసరా రోజు పాలపిట్టను చూడాలనే ఓ నమ్మకం కూడా ఉంది. పాండవులు జమ్మి చెట్టు మీద నుంచి ఆయుధాలు తీసుకుని వస్తుండగా వారికి పాలపిట్ట కనిపించిందని అందుకే వారు యుద్దంలో విజయం సాధించారని హిందువుల నమ్మకం. అందుకే పాలపిట్టను దసరా నాడు చూడటం చాలా శుభసూచకంగా చెప్పుకొవచ్చు.

సంబంధిత పోస్ట్