ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేశారు. శ్రేయాస్ అయ్యర్ 63 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్నారు. 36వ ఓవర్లో అబ్రార్ వేసిన ఐదో బంతికి సింగిల్ తీసి శ్రేయాస్ అర్ధశతకం అందుకున్నారు. దీంతో టీమిండియా స్కోరు 37 ఓవర్లకు 201/2గా ఉంది. విరాట్ కోహ్లీ (81), శ్రేయాస్ అయ్యర్ (50) పరుగులతో ఉన్నారు.