ఇండీడ్‌లో 2,200 మందికి ఉద్వాస‌న‌

260చూసినవారు
ఇండీడ్‌లో 2,200 మందికి ఉద్వాస‌న‌
వేలాది మందికి ఉద్యోగాలు ల‌భించేందుకు స‌హ‌క‌రించే జాబ్ సైట్ ఇండీడ్ ఏకంగా 2,200 మంది ఉద్యోగుల‌పై వేటు వేసింది. కంపెనీలో 15 శాతం సిబ్బందికి ఉద్వాస‌న ప‌లికింది. లేఆఫ్స్ నిర్ణయాన్ని బ్లాగ్‌పోస్ట్‌లో వెల్ల‌డించిన జాబ్ సైట్ సీఈఓ క్రిస్ హైమ్స్ త‌న మూల వేత‌నంలో 25 శాతం కోత విధించుకున్నాన‌ని తెలిపారు. మిగిలిన 75 శాతం వేత‌నం ఇండీడ్ రాబ‌డి వృద్ధితో ప్ర‌భావితం అవుతుంద‌ని చెప్పారు.