భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15, గురువారం జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి, భారత తీర రక్షక దళం కూడా లక్షద్వీప్‌లో ప్రత్యేక పద్ధతిలో సముద్రం కింద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఈ ఆసక్తికర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాన్ని ఇండియన్ కోస్టల్ గార్డ్ తన అధికారిక X ఖాతాలో షేర్ చేసింది.