ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. అద్భుతమైన బ్యాటింగ్, అసాధారణ బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌పై ఆసీస్ పట్టు బిగించింది. 157 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. 128 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. జైశ్వాల్ 24, కేఎల్ రాహుల్ 7, గిల్ 28, కోహ్లీ 11, రోహిత్ శర్మ 6 పరుగులు మాత్రమే చేశారు. ప్రస్తుతం పంత్ 28*, నితీశ్ 15* క్రీజులో ఉన్నారు.