చిన్న, సన్నకారు రైతులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుభవార్త చెప్పింది. ఎలాంటి తనఖా లేకుండా రైతులు తీసుకునే వ్యవసాయ రుణాల పరిమితిని రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం వెల్లడించారు. పెట్టుబడి ఖర్చులు, ద్రవ్యోల్బణం, తదితర అంశాలను పరిగణలో తీసుకుని రుణ పరిమితిని సవరించినట్లు ఆయన తెలిపారు.