కుప్పంలో ‘పుష్ప-2’ థియేటర్లు సీజ్

81చూసినవారు
AP: కుప్పంలో ‘పుష్ప-2’ సినిమాలు ప్రదర్శిస్తున్న రెండు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. లక్ష్మి, మహాలక్ష్మి థియేటర్లను అధికారులు మూసివేశారు. లైసెన్స్ రెన్యూవల్ చేసుకోకుండా, ఎన్ఓసీ తీసుకోకుండా సినిమా ప్రదర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు థియేటర్ల యాజమాన్యానికి శనివారం నోటీసులు అందజేశారు. థియేటర్లు మూతబడటంతో సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులు వెనుదిరిగారు.

సంబంధిత పోస్ట్