అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో తమ కుమారుడు బారన్ పాత్ర కూడా ఉందని మెలానియా తాజాగా చెప్పారు. ట్రంప్ యువతను ఆకట్టుకోవడంలో బారన్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. ప్రస్తుతం యువత టీవీ వంటి సంప్రదాయ మీడియా కంటే ఫోన్లు, స్ట్రీమింగ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారని, ఆ విషయాన్ని అతను బాగా గుర్తించాడని చెప్పారు. ట్రంప్ ఎవరిని సంప్రదించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసని, అతని వ్యూహాలు ఫలించాయని పేర్కొన్నారు.