తెలంగాణ మెదక్ జిల్లా అల్లదుర్గ్ మండలంలోని కాగిదంపల్లి మద్యం తాగినా, విక్రయించినా రూ.2 లక్షల జరిమానాతో పాటు ఇతర శిక్షలు విధిస్తారు. గ్రామస్థులు అందరూ కలిసి దృఢ నిశ్చయం తీసుకున్నారు. కాగిదంపల్లి గ్రామంలో 12 ఏళ్లుగా పూర్తిగా మద్యపాన నిషేధం అమలు జరుగుతోంది. గ్రామంలో ఒకవేళ ఎవరికైనా అలవాటు ఉంటే, అది మానుకునే వరకు ఇతర గ్రామాల్లో సేవించాలని నిబంధనలు విధించారు. ఈ గ్రామ ప్రజలు తమ కట్టుబాటుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.