అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్ బోణీ

67చూసినవారు
అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్ బోణీ
అండర్‌-19 ప్రపంచకప్‌‌లో భారత్ బోణీ కొట్టింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళలు 9 వికెట్ల తేడాతో విజయం సాధించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌‌ను 44 పరుగులకే కట్టడి చేసిన భారత జట్టు.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 4.2 ఓవర్లలోనే చేధించింది. తెలుగమ్మాయి త్రిష (4) నిరాశ పరచగా.. కమిలిని (16*) సానికా చాల్కే (18*) పరుగులు చేసి టీమిండియాకు విజయాన్ని అందించారు.

ట్యాగ్స్ :