భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య శనివారం చెన్నై వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్.. లీడ్‌ను మరింత పెంచుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత పేసర్ షమీ ఆడతాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. చెన్నై పిచ్ స్పిన్‌తో పాటు పేస్‌కు కూడా అనుకూలంగా ఉండనుంది. దీంతో తుది జట్టులోకి షమీని తీసుకోవాలని భారత్ భావిస్తోంది. దీంతో రవి బిష్ణోయ్ స్థానంలో మహమ్మద్ షమీ రీఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.