పారిస్ ఒలింపిక్స్‌లో లింగవివాదంపై భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్ స్పందించారు. తాను కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ‘‘అధిక టెస్టోస్టిరాన్ స్థాయులు ఉన్న వ్యక్తి పోటీ గురించి ఉన్న ఐఓసీ నిబంధనను గతంలో నేను సవాల్ చేశాను. నా జెండర్‌కు సంబంధించిన ఎంతో వివాదాన్ని ఎదుర్కొన్నాను. ఒలింపిక్స్ ఆడేప్పుడు ఎన్నో పరీక్షలు చేస్తారు’’ అని ద్యుతి అన్నారు.