దేశంలోని 11 కోట్ల మంది రైతులకు ఆధార్ తరహాలో డిజిటల్ ఐడీలు జారీచేయాలని కేంద్రం నిర్ణయించింది. రైతులను సాధికారులను చేసేందుకు వచ్చే 3 ఆర్థిక సంవత్సరాలలో ఈ కార్డులను జారీచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అగ్రిస్టాక్ కార్యక్రమంలో భాగంగా రైతులకు అందజేసే సేవలు, పథకాలను క్రమబద్ధం చేసేందుకు డిజిటల్ ఐడీలను ఇవ్వనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 కోట్ల మందికి, వచ్చే ఆర్థిక సంవత్సరం మూడు కోట్ల మందికి డిజిటల్ ఐడీలను జారీచేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.