యవ్వనంలో ఉన్నప్పుడు కులమతవిభేదాలను పూర్తిగా వ్యతిరేకించారు అల్లు రామలింగయ్య. ఓ నిమ్నకులస్థుడిని అగ్రవర్ణాల వారు అవమానిస్తే వారికి దేహశుధ్ధి చేసి అరెస్ట్ అయ్యారు. తరువాత స్వరాజ్య పోరాటంలోనూ జైలు శిక్ష అనుభవించారు. ఆ రోజుల్లోనే హోమియోపతి వైద్యాన్ని అభ్యసించి తగిన వైద్యం చేసేవారు. అలా వైద్యం చేస్తూ, ఇష్టమైన నాటకాలు వేస్తూ సాగుతున్న అల్లు రామలింగయ్యను గరికపాటి రాజారావు తన ‘పుట్టిల్లు’ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయం చేశారు.