ఫేక్‌ యాప్‌పై IRCTC అలర్ట్‌

1312చూసినవారు
ఫేక్‌ యాప్‌పై IRCTC అలర్ట్‌
భారతీయ రైల్వే పేరిట చలామణీ అవుతున్న నకిలీ యాప్‌పై IRCTC అప్రమత్తమైంది. ఐఆర్‌సీటీసీని పోలిన ఓ నకిలీ యాప్‌ వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి మెసెంజర్‌ యాప్స్‌లో సర్క్యులేట్‌ అవుతోందని, దాన్ని ఎవరూ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని సూచించింది. ఏపీకే ఫైల్‌ రూపంలో ఉన్న ఆ యాప్‌ను ఒకవేళ ఎవరైనా మొబైల్లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చిక్కులు తప్పవని హెచ్చరించింది. ప్లే స్టోర్‌ ద్వారా మాత్రమే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరింది.

ట్యాగ్స్ :