కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జెట్లీ తన మనసులో గూడుకట్టుకొని ఉన్న పీడకలలాంటి బాల్య జ్ఞాపకాలను బయటపెట్టారు. ‘‘స్కూలులో చదివే రోజుల్లో అబ్బాయిలు పలుమార్లు నన్ను వేధించారు. ఆ విషయం టీచర్లకు చెబితే.. నన్నే తప్పు పట్టేవారు’’ అని సెలీనా జెట్లీ తన బాల్యంలోని వేదనను ‘సోషల్ ఎక్స్’ వేదికగా పంచుకొన్నారు.