పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, అస్వస్థతకు గల కారణాలను ఇంకా గుర్తించలేదు. ఫుడ్ పాయిజన్ జరిగిందా? లేక ఇటీవల పాఠశాల పరిధిలో కొట్టిన గడ్డి మందు వల్ల ఈ పరిణామం చోటు చేసుకుందా.. అనేది అధికారులు ఆరా తీస్తున్నారు.