పది నెలల్లో అద్బుతాలు జరుగుతాయా.. పది నెలల్లో చేయని పని ఏదైనా ఉందా? అని తెలంగాణ యువతను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నేను కూడా మీ నుంచి వచ్చిన వాడినే అని తెలిపారు. తెలంగాణ యువత ఉద్యమబాట పట్టి రాష్ట్రాన్ని సాధించుకుందని సీఎం తెలిపారు. స్వాతంత్య్ర భారతంలో ఏడాది వ్యవధిలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ చేసిన తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించామన్నారు.